పట్టణ ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సమీపంలో భారీ వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ ల కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.