ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామంలో గండి చెరువు కట్ట లీకేజీ కారణంగా చెరువులోని నీరు వృధాగా పోతుంది. గత కొన్ని రోజులుగా కుడిచిన వర్షాలతో గండి చెరువుకు భారీగా వరద నీరు చేరడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈలోపే కట్టకు లీకేజీ కారణంగా నీరు అంతా వృధాగా పోతుందని రైతులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తి చేశారు.