బిక్కవోలు, గొల్లల మామిడాడ లో పురాతన ఆలయాలను అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద తహసిల్దార్, రెవెన్యూ మరియు టూరిజం శాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం ఆయన సమావేశం అయ్యారు. లక్ష్మీగణపతి ఆలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం తో పాటు సూరి నారాయణస్వామి ఆలయాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.