జీవో నెంబర్ 49 ని రద్దు చేయడంతో పాటు పోడు భూముల సమస్యలను పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన సత్యగ్రహ దీక్షకు మద్దతుగా సిర్పూర్ బిజెపి నాయకులు నిరాహార దీక్ష చేపడుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో నెలకొన్న పోటు భూముల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు,