నంద్యాల పట్టణంలో ఐదు రోజుల పాటు భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న గణనాధునునికి భక్తులు అత్యంత వైభవంగా వీడ్కోలు పలికారు. ఆదివారం ఉదయం నుండి సోమవారం తెల్లవారుజామున వరకు గణేష్ శోభయాత్ర కొనసాగింది. పట్టణంలో వినాయక నిమజ్జనానికి మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కేంద్ర గణేష్ మహోత్సవ సమితి సభ్యులు గణనాధులకు ఆహ్వానం పలుకుతూ నిమజ్జనం చేశారు.