కడప జిల్లా లోని గండిక్షేత్రంలో ఐదవ శ్రవణ శనివారం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శనివారం సాయంత్రం గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అలయ పూజలు కేసరి, రాజా స్వాములు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు.