బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజమహల్ ముఖద్వారం వద్ద మహా గణనాథుడు కొలువయ్యాడు. వనపర్తి లో మొట్టమొదటిసారిగా మహాగణానాధుడు కొలువవడం తో జిల్లాలోని ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో వివిధ పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో అభివృద్ధి పథంలో నడపాలని అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ గణనాథుని కోరినట్లు తెలియజేశారు.