ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్ లో పోలేరమ్మ తల్లి కొలుపులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి నైవేద్యాలు చేసుకొని భాజా భజంత్రీలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కొలుపుల సందర్భంగా ప్రతి సంవత్సరం భారీ ఎత్తున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు.