ములుగు ఏజెన్సీ గ్రామాల్లో నూతన రోడ్లు నిర్మించాలని సీపీఐ మండల కార్యదర్శి కృష్ణయ్య నేడు శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు డిమాండ్ చేశారు. జగ్గన్నగూడెం నుంచి ఊటాయి రాంపూర్ వరకు 15 కి.మీ. రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కొత్తగూడెం నుంచి పంచోతుకులపల్లి – ములుగు మండలం కన్నాయిగూడెం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ఏజెన్సీ గ్రామాలు అభివృద్ధి కావాలంటే నూతన రోడ్లను ప్రభుత్వం నిర్మించాలని డిమాండ్ చేశారు.