కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం వద్ద ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న 'మహానాడు' నేపథ్యంలో శనివారం రాష్ట్ర డి.జి.పి శ్రీ హరీష్ కుమార్ గుప్తా, అడిషనల్ డిజి మధుసూదన్ రెడ్డి వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన వేదిక, ఫుడ్ కోర్ట్ ల వద్ద చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు పలు సూచనలిచ్చారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు సూచించారు. 'మహానాడు' కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న