విజయనగరం జిల్లాలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారు జనార్దన రావు కోరారు. సంకిలిలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎరువులు కృత్రిమ కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ ఉన్నతాధికారులు దృష్టి సారించి ఎరువులు కొరత లేకుండా సరఫరా చేయాలని కోరారు. ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్నారని ఆరోపించారు.