కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం ఉదయం పసుపల గ్రామంలోని తన నివాసంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు అర్జీ రూపంలో ఇచ్చుకున్నారు. సమస్యలపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.