స్వదేశీ వస్తువులకు ప్రోత్సాహం ఇస్తూ దేశ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంతీయ యువ ప్రముఖ్ రాహుల్ కుమార్ అన్నారు. స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు మంగళవారం ఆదిలాబాద్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విదేశీ ఆధారిత ఆన్లైన్ వెబ్సైట్లలో ఎక్కువగా షాపింగ్ చేయకుండా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.