రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు జరుగుతున్న తీరుపై పేద వర్గాలు చాలా ఇబ్బంది పడుతున్నారని వారికి మద్దతుగా ఈనెల 15వ తేదీన బంద్ పాటిస్తున్నట్లు అలాగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ టిఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.