సామ్రాజ్యవాద దేశాలలో సంక్షోభం ముదురుతుంది.ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష రాజకీయాలకు మద్దతు పెరుగుతుంది.వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం,ఐలమ్మ పోరాట స్పూర్తితో సెప్టెంబర్ 10 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు.సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా "భాంచన్ దొరా నీ కాల్మొక్త" అనే నీచ సంస్కృతికి ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత చిట్యాల ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.