శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో శుక్రవారం రాత్రి ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు భూలక్ష్మి తన భర్త జానకిరామ్ తో కలిసి విశాఖపట్నం బయలుదేరారు.భూలక్ష్మి నిండు గర్భిణీ కావడంతో ట్రైన్ లో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆముదాలవలస రైల్వే స్టేషన్ లోనే అర్ధరాత్రి దాటిన వేళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.పురిటినొప్పులు ఎక్కువ కావడంతో అక్కడికి చేరుకున్న వైద్యురాలు మరో బిడ్డ ఉందని చెప్పడంతో హుటాహుటిన జమ్స్ ఆసుపత్రికి రైల్వే పోలీసులు, సిబ్బంది తరలించారు.జమ్స్ ఆసుపత్రిలో మరో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి ఇద్దరు ఆడబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు.