కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం సిర్పూర్ పేపర్ మిల్లులో ఫైబర్ డిపార్ట్మెంట్లో ప్రమాదం జరిగి తీవ్ర గాయాలై ప్రాణాపాయస్థితిలో ఉన్న దాసరి భాస్కర్ అనే కాంట్రాక్టు లేబర్కు నాణ్యమైన వైద్యం అందించాలని అన్నారు. 80% శరీరం కాలిన దాసరి భాస్కర్ కు ఏదైనా జరగరానిది జరిగితే 50 లక్షల నష్టపరిహారం అందించాలని సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ శ్యామ్ రావు అన్నారు,