Parvathipuram, Parvathipuram Manyam | Aug 27, 2025
పార్వతీపురం పట్టణ తో పాటు మండలం బలిజిపేట సీతానగరం తదితరు ప్రాంతాల్లో బుధవారం వినాయక ఉత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలను ఆయా గ్రామాల్లోని వార్డుల్లో మంటపాల వద్ద ఏర్పాటు చేశారు. పార్వతీపురం పట్టణంలో వినాయక దేవాలయం నుండి విగ్రహాలకు పూజలు నిర్వహించి ట్రాక్టర్ల పై ఊరేగింపుగా ఆయా మంటపాలకు తరలించారు. నవరాత్రులు పూజలు నిర్వహించేందుకు భక్తుల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.