సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓపెన్ చేసి ఒకటిన్నర మీటర్ ఎత్తులో దిగువకు వరద జలాలు వదిలినట్లు ప్రాజెక్టు ఏఈఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 9230 క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుతుండగా 9600 క్యూసెక్కులు అవుట్ ఫ్లో నదిలోకి వరద జలాలు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.