రైతులకు ఎరువుల విక్రయాల్లో రద్దీ తగ్గించి సౌకర్యవంతమైన విధంగా పంపిణీ చేయడానికి అదనంగా 16 ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో వ్యవసాయ శాఖ, సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనంగా ఏర్పాటు చేయనున్న 16 ఎరువుల విక్రయ కేంద్రాలకు ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. రైతులు సమయానికి ఎరువులు పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామ పేర్కొన్నారు. రైతులు రద్దీ తగ్గించేందుకు అదనపు ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.