నెల్లూరు అలంకార్ సెంటర్ సమీపంలోని విక్టోరియా గార్డెన్ వద్ద మూలాపేటకు చెందిన లైక్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాల ప్యాకెట్ కి వెళ్ళిన యువకుడ్ని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హతమార్చారు. మృతుడికి మరో వ్యక్తికి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య విషయం తెలుసుకున్న చిన్న బజారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మార్చురీకి తరలించారు.