పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం చినమేరంగి లో మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి నివాసంలో ఘనంగా నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసిపి మన్యం జిల్లా అధ్యక్షుడు పరిక్షిత్ రాజు పాల్గొన్నారు. మొదటగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, వైసిపి నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు అందరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషలతో ఉండాలన్నారు.