అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమేనని, దేశంలోనే టాఫ్ 3లో సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారని, ఆనాడు హైదరాబాద్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో నేటికీ అక్కడి ప్రజలు చంద్రబాబు గురించే మాట్లాడు కుంటున్నారని నంద్యాల ఎంపీ,లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.సోమవారం ఉదయం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం తూర్పు,పరమట ప్రాతకోట గ్రామాల్లో, మిడ్తూరు మండలం కడుమూరు గ్రామాల్లో ఎంపీ నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ఫ్లాంట్లు ప్రారంభించి, అర్హులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు.