కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు, గుత్తేదార్లకు సూచించారు. ఈరోజు గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోని వేడుకల మందిరంలో ఆలయ చైర్మన్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయశాఖ, పీఆర్, ఆర్ అండ్ బీ, టూరిజం, మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈలు, డీఈలు, ఏఈలు మరియు రేగొండ ఎమ్మార్వో, ఎంపీడీవో, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షా సమావేశంనకు ముందు ఎమ్మెల్యే