గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు.జగిత్యాలజిల్లా ధర్మపురి మండలం అకుసాయిపల్లె,దొబ్బల గూడెం,బోదరి నక్కల చెరువు గూడెం గ్రామాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం రోజున అయన సందర్శించారు. ఈ సందర్బంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ. జిల్లాలోని అన్ని గిరిజన గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు.