ఈ నెల 7న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో గర్భిణులు, కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలని భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పాణింద్ర శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుందన్నారు. రా.11.45 గంటలకు మధ్యకాలం, తెల్లవారుజాము 1.30 గంటలకు మోక్ష కాలమని చెప్పారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు రాత్రి 9 గంటల లోపు ఆహారం తీసుకొని ఉండాలన్నారు.