నల్లగొండ జిల్లా కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం గ్రౌండ్ ఫ్లోర్ను డిసెంబర్ లోగా మొత్తం భవనాన్ని వచ్చే సంవత్సరం జూన్ రెండు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా ప్రోగ్రాం శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ను శుక్రవారం ఆదేశించారు. 82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనంలో పూర్తిగా రెవిన్యూ విభాగం జిల్లా కలెక్టర్ ,అదనపు కలెక్టర్ల చాంబర్లు మంత్రి చాంబర్లు ఉండేలా ఏర్పాటు చేయాలని పాత కలెక్టర్ కార్యాలయంలో పూర్తిగా జిల్లాలోని అన్ని శాఖల ఆధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.