ఓల్డ్ డైరీ ఫార్మ్ అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో శుక్రవారం స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ సిటిజెన్ రైట్స్ బృందం వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సూచి బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రతి కార్యాలయంలో బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రజలకు అవగాహన ఏర్పడుతుందని, అవినీతి చేసే అధికారి కి భయం పుడుతుందని తెలిపారు. ఎసిబి నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించి మీ వినతిని ప్రణాళిక బద్దం చేస్తామని అవినీతిన నిర్మూలించడానికి తమ కార్యాలయం 24*7 పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రజల్లో నైతిక బాధ్యత పెరగాలని లంచం అడిగిన అధికారుల్ని నిలదీసే హక్కు ప్రజలకు ఉందని ఆయన తెలిపారు.