తామర పువ్వుల కోసం వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. మంగళవారం స్థానికులు తెలిపిన విరాల ప్రకారం.. రేపు జరగబోయే వినాయక చవితి పండుగ కు తామర పువ్వులకు ప్రాధాన్యత ఉండడంతో వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మిట్ట కోడూరు గ్రామంలో గల చెరువులో తామర పూలు తెంపేందు కు వెళ్లిన ఒక వ్యక్తి గల్లంతు అయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడు ఉదన్ రావు పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగ