శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లిలో శనివారం సాయంత్రం కొందరు అల్లరి మూకలు హిందూపురం నుంచి వచ్చి నేషనల్ హైవేపై బైక్ రేసింగ్ పెట్టుకుని వీలింగ్ చేస్తుండగా 10 బైకులు సీజ్ చేసినట్లు సోమందేపల్లి ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. బైకుల యజమానులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ఫైన్ వేసి, కట్టించామన్నారు. ఒక బుల్లెట్ సైలెన్సర్ మార్చి అధిక శబ్దాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నందున జరిమానా విధించామన్నారు.