వాతావరణం మార్పుల కారణంగా వ్యాపించే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని త్రినేటి హాస్పిటల్ వైద్యులు సూచించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం జువ్వలపాలెం ఎస్టీ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు హాస్పిటల్ వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య విషయాలపై పలు సూచనలు చేశారు. పాఠశాలలోని విద్యార్థులను సైతం ఆరోగ్యపరంగా పరీక్షించారు. పిల్లల ఎత్తు బరువులను పరిశీలించారు. పౌష్టికాహార విలువలను తెలియజేశారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.