భారీ వర్షాల మూలంగా చెరువులు వాగుల వద్ద ఈతకు చేపల వేటకు వెళ్లరాదని సాహసాలకు పోవద్దని హెచ్చరించిన యువకులు ప్రజలు పట్టించుకోవడం లేదు. రెండు రోజులుగా భారీ వర్షాలతో వాగులు వంకలు, పొంగి పొందుతున్న చేపల వేట మాత్రం అవడం లేదు. బాన్సువాడ మండలం కోనాపూర్ చెరువు ప్రమాద స్థాయికి చేరి అలుగు పారడంతో స్థానికులు వరదలు లెక్కచేయకుండా చేపల వేట కొనసాగిస్తున్నారు. భారీ స్థాయిలో నీటి ప్రవాహం ఉన్న వాటిని పట్టించుకోకుండా చేపల వేట కొనసాగించడం పట్ల అధికారులు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.