హైడ్రాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించాలని హైడ్రా మీద రాష్ట్ర ప్రజానీకానికి పూర్తి నమ్మకం , విశ్వాసాన్ని ప్రజలకు కల్పించేలా ప్రభుత్వమే ఆ పనిని చేతల్లో చూపించాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అధ్యక్షులు జలాల్ కోరారు. మంగళవారం ఉదయం ఆయన పాల్వంచలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాను వెనక్కి తీసుకోకూడదని తీసుకోవాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. హైడ్రాను తీసుకొచ్చి చెరువులు కుంటలు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ కోసం భవిష్యత్ తరాల భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఒక వినూత్న ప్రయత్నం హర్షణీయం అన్నారు