శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం 'అన్నదాత పోరు'లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. గణేశ్ సర్కిల్లోని వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ప్ల కార్డులు చేతపట్టి జై జగన్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.