ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పి . రాజబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీటీ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏలూరులోని పలు పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలను ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించాలన్నారు.