మొవ్వ మండలం చినముత్తేవిలోని అయినంపూడి డ్రైనేజీపై శిథిలావస్థకు చేరిన వంతెన మరమ్మతు పనులు ప్రారంభమయ్యా యి. సీపీఎం నేతలు, గ్రామస్థులు అనేకసార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో పాత రేకులను తొలగించి, కొత్త రేకులతో పనులు కొనసాగిస్తున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అధికారులు రిపేర్ పనులు చేపట్టినందుకు సీపీఎం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.