మాతృభాష అయిన తెలుగు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టరుతో పాటు డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియచెప్పిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని కొనియాడారు