ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో రూ.1.22 కోట్లతో నిర్మించిన నూతన సచివాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్థానిక కార్యకర్తలు అధికారులు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న అని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికే చాలా వరకు నెరవేర్చామని తెలిపారు.