మైదుకూరు: వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ రమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన వార్డు సచివాలయ సిబ్బంది ఇన్చార్జ్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని కార్యాలయంలో కలిసి సమస్యలను వివరించారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వాలంటీర్ల బాధ్యతలను వారిపై మోపకూడదని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.