తూప్రాన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ ముసాయిదా జాబితా పై రాజకీయ పక్షాల సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. తూప్రాన్ మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు, 28 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్బంగా ఏంపిడిఓ వివరించారు. ముసాయిదా జాబితాపై ఏమైన పిర్యాదులు ఉంటే మంగళవారం సాయంత్రం వరకు లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదు చేయాలన్నారు.