గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీలో గురువారం రమేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉరవకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన రమేష్ గుత్తిలో వివాహం చేసుకున్నాడు. అత్తారింటికి వచ్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.