డప్పు కళాకారుల డిమాండ్లు నెరవేర్చండి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి రాష్ట్రంలోని డప్పు కళాకారుల న్యాయపరమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య విజ్ఞప్తి చేశారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో శనివారం డప్పు కళాకారుల సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుల్లయ్య హాజరయ్యారు. గతంలో చంద్రబాబు దళిత తేజం పేరిట డప్పు కళాకారులను ఆదుకుంటామని చెప్పి అన్యాయం చేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం సైతం చంద్రబాబు బాటలోనే నడిచిందని మండిపడ్డారు.