ప్రభుత్వం నిర్దేశించిన పథకాల అమలులో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే క్షమించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరిక జారీ చేశారు ప్రభుత్వ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు శుక్రవారం జిల్లాలని కోరుకొండ ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి సమీక్ష నిర్వహించారు.