జనగామ జిల్లాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ జనగామ కలెక్టర్ ఎదుట ధర్నాకు దిగారు.అంతకు ముందు ర్యాలీగా ఆర్టీసీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేరుకున్నారు.వీరి ఆందోళనకు MRPS నేతలు మద్దతు తెలిపారు.కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.పోలీసులకు MRPS,VHPS కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.దీంతో కలెక్టర్ ఎదుట బైఠాయించి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.