మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీవారి ప్రసాదం, మంత్రాక్షితలు అర్చకులు, అధికారులు అందజేశారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆఫీసర్ పగడాల ఆనంద తీర్థ ఆచార్ పీఠాధిపతి చాతుర్మాస దీక్ష స్వీకరించిన సందర్భంగా పుష్పవృష్టి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి టీటీడీ అధికారులకు, అర్చకులకు శేష వస్త్రం, ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.