స్మశాన వాటికలో కరెంటు సౌకర్యం లేక రాత్రిపూట దహన సంస్కరణ చేయడం కోసం సెల్ఫోన్ లైట్లు వెలుగులో దహన సంస్కారాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు తోట శ్రీనివాస్ మండిపడ్డారు, జిల్లా కేంద్రంలోని 17 ,18 వార్డులో ఉన్న హిందూ స్మశాన వాటికలో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ,వెంటనే సమస్యలను పరిష్కరించాలని స్మశాన వాటిక ముందు ధర్నా చేసి గడ్డి మందు కొట్టి శనిరసన తెలిపారు.