ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు తమ రాజకీయ స్వలాభం కోసం అన్నదమ్ములు లాగా ఉన్న గిరిజన బంజారాల మధ్య గొడవలు పెడుతూ బబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. నిజాం కాలంలో గోల్కొండ కిల్లా పైన బంజారా భవనాన్ని సపరేట్గా ఉందని ఆయన గుర్తు చేశారు. భూమి పుత్రుల మేమని దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టిన వారమని ఆయన తెలిపారు. కొందరు కావాలనే గొడవలు పెడుతున్నారని మండిపడ్డారు.