కుందుర్పి మండలం మలయనూరు సమీపంలో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. షిమొగ్గ నుంచి తాడిపత్రి కి వెళుతున్న లారీ డ్రైవర్ కునుకు తీయడంతో లారీ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ గాయపడ్డాడు. ఈ సంఘటనపై కుందుర్పి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.