కౌటాల మండలంలో గణేష్ ఉత్సవాలతో పాటు మిలాద్ ఉన్ నబి ని శాంతియుతంగా జరుపుకోవాలని కోటాల సిఐ సంతోష్ కుమార్ సూచించారు. కౌటాల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో సిఐ సంతోష్ కుమార్ మాట్లాడారు. గణేష్ మండపాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కమిటీ సభ్యులకు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు,