కోనసీమ కేంద్రం అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శనివారం తెలియజేశారు. ఈ నేపథ్యంలో థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో గడియార స్తంభం సెంటర్లో విద్యార్థులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఎన్నికల హామీల్లో అమలాపురానికి డిగ్రీ కాలేజ్ తెస్తానన్న మాట సంవత్సరకాలంలోనే నెరవేర్చిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు.